దాడికి కుట్ర.!!

- June 04, 2016 , by Maagulf
దాడికి కుట్ర.!!

ఈ ఏడాది జరగనున్న అమర్‌నాథ్‌ యాత్రపై మిలిటెంట్లు దాడి చేసే అవకాశం ఉందని సరిహద్దు భద్రతా దళ(బీఎస్‌ఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ కెకె. శర్మ వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో జరిగే అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనే భక్తులపై దాడులు జరపడానికి మిలిటెంట్లు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం అందిందన్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు హాజరయ్యే భక్తుల భద్రతకై తాము అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఎక్కడికక్కడ భద్రతా సిబ్బందిని నియమిస్తున్నామని తెలిపారు. నిన్న బీఎస్‌ఎఫ్‌ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేస్తారని వూహించలేదన్నారు.
ఈ దాడిలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో మృతి చెందిన జవాన్లకు జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com