APSSDC కి ఐఎస్ఓ గుర్తింపు

- April 02, 2024 , by Maagulf
APSSDC కి ఐఎస్ఓ గుర్తింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) 9001 - 2015 సర్టిఫికెట్ ను గ్లోబల్ మానేజ్మెంట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి క్వాలిటీ మానేజ్మెంట్ సిస్టం విభాగంలో 
 సర్టిఫికెట్ దక్కించుకోవడం ఆనందంగా ఉందని సంస్థ ఎండీ సీఈఓ డాక్టర్.వినోద్ కుమార్ అన్నారు. ఐఎస్ఓ సర్టిఫికేషన్ రావడం సంస్థకు గర్వకారణం అని, ఈ ఘనత సాధించేందుకు కారణమైన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.ఈ మేరకు తాడేపల్లిలోని ఎపిఎస్‌ఎస్‌డిసి ప్రధాన కార్యాలయంలో, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యస్ . సురేష్ కుమార్ ఐఏఎస్,  ఎండి సీఈవో డాక్టర్ . వినోద్ కుమార్ .వీ ఐఏఎస్,  కలిసి  ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికెట్ అందుకున్నారు. 

అనంతరం నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యస్ . సురేష్ కుమార్ ఐఏఎస్ మాట్లాడుతూ .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సంస్థలో సిబ్బంది బాగా పనిచేస్తున్నప్పటికీ ఇతరులు గుర్తించినపుడే మన ప్రతిభ అందరికీ తెలుస్తుందని.. ఇప్పుడు ఐఎస్ఓ సర్టికెట్ ద్వారా ఎపిఎస్‌ఎస్‌డిసి మరో మైలురాయిని అధిగమించిందని ఆయన అన్నారు. ఈ సర్టిఫికెట్ ను సాధించిన తర్వాత దాన్ని నిలబెట్టుకునేందుకు మరింత బాగా పనిచేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో ఇది మన సంస్థకు అదనపు గుర్తింపు ఇస్తుందన్నారు. ఈ గుర్తింపు భవిష్యత్తులో అమలు చేయబోయే నైపుణ్యశిక్షణా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేలా బాధ్యత పెంచిందని  అన్నారు.

ఈ సర్టిఫికేషన్ ను హైదరాబాద్ కి చెందిన గ్లోబల్ మానేజ్మెంట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందించింది. ఈ కార్యక్రమంలో ఎపిఎస్‌ఎస్‌డిసి నైపుణ్యాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యస్ . సురేష్ కుమార్,ఎపిఎస్‌ఎస్‌డిసి ఎండి, సీఈవో డాక్టర్.వినోద్ కుమార్ , ఓ యస్ డి కే నాగ బాబు తోపాటు ఐఎస్ఓ సంస్థ ఎండీ కే.శివ నాగ ప్రసాద్ మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com