రాజ్యసభ సభ్యురాలిగా రేణుకా చౌదరి ప్రమాణం
- April 10, 2024
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు. రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తవ్వడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాగా మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు.
ఇటీవల తెలంగాణలోని పలు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగగా రేణుకా చౌదరి సహా పలువురి అభ్యర్థిత్వాలు ఏకగ్రీవమయ్యాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరితో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఇక బీఆర్ఎస్ తరపున ఏకైక అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర పెద్దల సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







