ఎక్కువగా చెమట పడుతోందా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.!
- April 10, 2024
చెమట పట్టడం అనేది చాలా సర్వ సాధారణమైన విషయం. అయితే కొందరిలో ఎక్కువగా చెమట పడుతుంటుంది. కొందరిలో తక్కువగా చెమట పడుతుంటుంది. చెమట పట్టడం అంటే, శరీరంలోని వ్యర్ధాలు, ట్యాక్సిన్లను శరీరం నుంచి బయటికి పంపించడం.
నిపుణుల సూచన మేరకు ఎక్కువగా చెమటలు పట్టేవారికి ఆరోగ్యం కూడా ఎక్కువే అంటున్నారు. ఎందుకంటే, శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, ట్యాక్సిన్స్ ఎప్పటికప్పుడు బయటికి పోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వుంటాయ్.
అలాగే, తక్కువగా చెమట పట్టే వారు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా అనిపించినా.. అది భవిష్యత్తులో ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత జీవన శైలిలో చెమట చిందించే పనులు తక్కువైపోయాయ్. రోజంతా ఏసీ రూముల్లో కూర్చుంటుంటే శరీరానికి తగిన చెమట పట్టడం లేదు. తద్వారా రకరకాల అనారోగ్యాలు ప్రళయ తాండవం చేస్తున్నాయ్.
అందుకే కొందరు ఖచ్చితంగా చెమట పట్టించడానికి తగిన వర్కవుట్లు గట్రా చేస్తున్నారు. ఏదో ఒక రకంగా శరీరం లోపల వున్న వ్యర్ధాలను బయటికి పంపించేయాలి. అందుకు శరీరాన్ని చెమట పట్టించేలా కష్టపెట్టడం తప్పనిసరి.. అని నిపుణుల సలహా. అంతేకాదండోయ్. చెమట పట్టించడమే కాదండోయ్, తగినంత వాటర్ కంటెంట్ కూడా బాడీకి అందిస్తుండాలి. లేదంటే, నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయ్ తస్మాత్ జాగ్రత్త.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం