ప్రబాస్ శివుడు కాదట.! శివుడి వాహనమట.!
- April 15, 2024
‘భక్త కన్నప్ప’ సినిమాలో ప్రబాస్ శివుడి పాత్ర పోషిస్తున్నాడట.. అంటూ ప్రచారం జరిగింది. కానీ కాదట. శివుడి వాహనం నంది పాత్రలో కనిపించబోతున్నాడట ప్రబాస్. ఇదీ తాజా ప్రచారం.
మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ‘భక్త కన్నప్ప’లో కాస్టింగ్ దిమ్మ తిరిగిపోయేలా రోజు రోజుకీ పెరిగిపోతోంది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్, శాండిల్ వుడ్.. ఇలా అన్ని భాషల నుంచీ పలువురు ప్రముఖ నటీ నటులు నటిస్తున్న ఈ చిత్రంలో ప్రబాస్ శివుడి పాత్ర పోషిస్తున్నాడంటూ ప్రచారం జరిగింది.
కానీ, ఆ పాత్రను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కి ఫిక్స్ చేశారట. నంది పాత్రకూ ఈ సినిమాలో అత్యంత కీలక స్థానం వుండడంతో.. ఆ పాత్రలో పవర్ ఫుల్ కటౌట్ వున్న ప్రబాస్‌ని ఫిక్స్ చేశారట.
ప్రస్తుతం న్యూజిలాండ్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది ‘భక్త కన్నప్ప’. త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం టీమ్ సంసిద్ధమవుతోందట. అయితే, ఈ సినిమాపై రోజుకో రకం రూమర్ పుట్టుకొస్తోంది. అసలు నిజాలేంటో.. త్వరలోనే ఓ క్లారిటీకి రానుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?