2 రోజులలో 884 విమానాలు రద్దు

- April 18, 2024 , by Maagulf
2 రోజులలో 884 విమానాలు రద్దు

యూఏఈ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,  వరదల కారణంగా దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్‌బి)లో గత రెండు రోజులుగా మొత్తం 884 విమానాలు రద్దు చేసినట్టు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి తెలిపారు. వరదల కారణంగా ఆపరేషన్‌లో అంతరాయం ఏర్పడిన తర్వాత గురువారం ఉదయం విమానాశ్రయం టెర్మినల్ 1 నుండి పాక్షిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం 24 గంటల్లో సాధారణ కార్యకలాపాల కోసం ప్రతికూల వాతావరణ ప్రభావాన్ని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తోంది.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com