బార్లీ నీళ్లు.! వీటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.?
- April 25, 2024
బార్లీ నీళ్లు తాగడంవల్ల జీర్ణ శక్తి మెరుగవుతుంది. ముఖ్యంగా ఎండ తాపాన్ని తట్టుకునే శక్తినిస్తుంది. వేసవిలో ప్రతీరోజూ ఉదయాన్నే బార్లీ నీళ్లు తాగేవారిలో తక్షణ శక్తితో పాటూ, ఎండ తాపాన్ని తట్టుకునే శక్తి కూడా వస్తుంది.
అలాగే బార్లీలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా వుండడంతో అధిక బరువు సమస్యలు కూడా దరి చేరవు. మూత్ర పిండాల్లో రాళ్లున్నవారు క్రమం తప్పకుండా బార్లీ నీళ్లు తాగితే మందులు అవసరం లేకుండానే వాటిని కరిగించుకోవచ్చు.
మూత్ర విసర్జన ద్వారా టాక్సిన్స్‌ని బయటికి పంపిచేందుకు తోడ్పడతాయ్ బార్లీ గింజలు. తద్వారా కిడ్నీ స్టోన్స్ ప్రమాదం వుండదు.
అలాగే, ఇందులోని ఫైబర్ అనవసరమైన కొవ్వు కణాల్ని కరిగించేయడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మెగ్నీషియం, కాల్షియం అధికంగా వుండడం వల్ల ఎముకలు ధృఢంగా మారతాయ్. తక్కువ గ్లైసెమిక్ కలిగి వుండడం వల్ల బార్లీ నీళ్లు మధుమేహులకు కూడా మంచి ఆరోగ్యకారిగా చెబుతారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?