నయనతారాతో సరదాగా మారుతీ

- June 07, 2016 , by Maagulf
నయనతారాతో సరదాగా మారుతీ

నయనతారాతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం అని దర్శకుడు మారుతీ అన్నారు. విక్టరీ వెంకటేశ్‌, నయనతారా జంటగా నటిస్తున్న 'బాబు బంగారం' చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో నయనతారాతో సరదాగా దిగిన ఒక ఫొటోను ఆయన తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నయనతారాతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం.. సెట్‌లోకి ఆమె ఎనర్జీని తీసుకువస్తుంది అని పోస్ట్‌ చేశారు. నిజమే ఈ ఫొటోను చూస్తే.. మారుతీ ఎందుకు అలా అన్నారో మీకూ అర్థం అవుతుంది.సోమవారం 'బాబు బంగారం' చిత్రం టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com