గస గసాలు వాడుతున్నారా.?
- May 14, 2024
మసాలా దినుసుల్లో ఒకటైన గసగసాలు ఆరోగ్యానికి చాలా మంచివి. గట్టిగా చెప్పాలంటే గసగసాలు ఎముకలను బలోపేతం చేయడంలో బాగా తోడ్పడతాయ్.
గసగసాల్లో ఎక్కువ శాతం కాల్షియం వుంటుంది. అందుకే ఎముకలను ధృడంగా వుంచేందుకు సహాయపడుతుంది.
వయసుతో పాటూ వచ్చే కీళ్ల నొప్పుల్ని దూరం చేయడంలోనూ గసగసాల పాత్ర అత్యంత కీలకం. అయితే, కేవలం మసాలా దినుసుగానే గసగసాలను ఉపయోగించాలా.? కాదని అంటున్నారు నిపుణులు.
గసగసాల్ని రాత్రి పూట నానబెట్టి, తెల్లారి పేస్ట్‌లా చేసుకుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయ్. అలాగే, పాలలో నానబెట్టిన గసగసాలు ఇంకాస్త మంచి ఫలితాలిస్తాయ్.
గసగసాల్ని పొడిగా చేసి, రోటీల్లోనూ, దోసెల్లోనూ కూడా కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గసగసాలతో స్వీట్ పాయసాలు కూడా చేసుకోవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. మరింకేం, కేవలం మసాలా దినుసుగా నాన్ వెజ్ ఐటెమ్స్‌లోనే గసగసాలను వాడడం కాదు.. పైన చెప్పిన వెజ్ ఐటెమ్స్‌లో కూడా వాడుతూ ఎముకల ధృడత్వాన్ని పెంచుకోండి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!