ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న విక్రమ్ ‘తంగలాన్’.!
- May 22, 2024
విలక్షణ నటుడు విక్రమ్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా బోలెడంత అభిమానం వుంది. అయితే, ఎందుకో తెలీదు ఆయన సినిమాలు రిలీజ్ కావడం చాలా చాలా కష్టమైపోతోంది ఈ మధ్య.
సినిమా కోసం ప్రాణమే పెట్టేస్తుంటాడు విక్రమ్. అలాగే, ఈ సారి కూడా ప్రాణం పెట్టి చేసిన సినిమా ‘తంగలాన్’. ఈ సినిమాలో విక్రమ్ సాహసాలు చాలా చాలా కొత్తగా వుండబోతున్నాయట. అలాగే, ఆయన గెటప్ కూడా కొత్తగా వుండబోతోందని ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల ద్వారా తెలిసింది.
కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ మైన్స్)కి సంబంధించి ఓ తెగపై జరిగిన అరాచకాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాకి దృశ్య రూపం ఇచ్చారు. మాళవిక మోహనన్ ఈ సినిమాలో విక్రమ్‌కి జోడీగా నటిస్తోంది.
ఇప్పటికే రిలీజ్ కావల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మరోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 13న ‘తంగలాన్’ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. చూడాలి మరి, ఈ సారైనా చెప్పిన డేట్‌కి వస్తుందో లేదో.!
తాజా వార్తలు
- టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
- టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు







