ఆ తరహా సినిమాలంటే ఇష్టమంటోన్న క్రేజీ బ్యూటీ.!
- May 22, 2024
మలయాళ మయూరం మాళవిక మోహనన్కి సోషల్ మీడియాలో వున్న క్రేజ్ సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇంతవరకూ తెలుగులో డైరెక్ట్ మూవీ చేసింది లేదు కానీ, టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది తన డబ్బింగ్ సినిమాలతోనే మాళవిక మోహనన్.
త్వరలో ప్రబాస్తో ‘రాజా సాబ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది మాళవిక. అంతకు ముందే, విక్రమ్ సరసన ‘తంగలాన్’ డబ్బింగ్ మూవీతో రాబోతోంది. అలాగే, తెలుగులో మరిన్ని ప్రాజెక్టులు మాళవిక కోసం చర్చల దశలో వున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్కి వున్న హీరోయిన్ల కొరత కారణంగా మాళవిక వంటి సక్సెస్ఫుల్ బ్యూటీస్ అవసరం ఎంతైనా వుంటుంది. ఇంతవరకూ తమిళంలో వరుస సినిమాలు చేసిన మాళవిక మోహనన్, ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు దక్కించుకుంటోంది.
అలాగే హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఇంత బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాని షేక్ చేసేందుకు కూడా ఎప్పటికప్పుడు టైమ్ కేటాయిస్తూ వుంటుంది.
హాట్ ఫోటో సెషన్లతో పాటూ, నెటిజన్స్తో పిచ్చా పాటీ కార్యక్రమంలోనూ పాల్గొంటుంటుంది. అలాంటి పిచ్చా పాటీలోనే తనకు హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ అంటే చాలా ఇష్టమని మనసులోని మాట బయట పెట్టింది.
‘రాజా సాబ్’ ఆ తరహా మూవీనే అని ప్రచారం జరుగుతోంది. అయితే, అలాంటి డిఫరెంట్ జోనర్ మూవీస్ చాలానే చేయాలని వుందట మాళవిక మోహనన్కి. చూడాలి మరి.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..