ఈ రెమిడీస్తో మధుమేహాన్ని కంట్రోల్లో వుంచుకోవచ్చు.!
- May 22, 2024
మధుమేహం (డయాబెటిస్) ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే చాలు.. ఇక జీవితాంతం మందులకు పరిమితం కావల్సిందే. అంతేకాదు, ఆహార నియమాల్లోనూ కొన్ని నియంత్రణలు తప్పని సరి.
వీటితో పాటూ, అనేక రకాల అనారోగ్య సమస్యలు మధుమేహుల్ని వేధిస్తుంటాయ్. అయితే, ప్రతీరోజూ తీసుకునే మందులతో పాటూ, మధుమేహం వున్న వాళ్లు కొన్ని వ్యాయామాలు చేయడం ద్వారా కూడా మధుమేహాన్ని నియంత్రణలో వుంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యంగానూ వుండొచ్చు.
కొన్ని చిన్న చిన్న యోగాసనాల ద్వారా మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. వాటిలో ముఖ్యమైనవి ప్రాణాయామం, శవాసనం. ఈ ఆసనాలను ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. ఈ ఆసనాలను క్రమం తప్పకుండా చేస్తుండడం వల్ల ప్లీహ గ్రంధి, పిట్యూటరీ గ్రంధి చక్కెర స్థాయిల్ని సాధారణ స్థితిలోకి తీసుకొస్తాయ్.
ఈ ఆసనాల్లో ధ్యానం, శ్వాస పధ్దతులు అనుసరించడం వల్ల అది సాధ్యమవుతుంది. అలాగే, క్రమం తప్పకుండా మధుమేహం వున్నవారు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







