‘గాడ్ ఫాదర్’ కాంబో మళ్లీ రిపీట్.!

- May 22, 2024 , by Maagulf
‘గాడ్ ఫాదర్’ కాంబో మళ్లీ రిపీట్.!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమాకి దర్శకుడు మోహన్ రాజా. మోహన్ రాజాకి మెగాస్టార్ చిరంజీవి అంటే అపారమైన అభిమానం. అలాగే చిరంజీవికీ మోహన్ రాజా అంటే ప్రత్యేకమైన గౌరవం వుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే, ఆ సినిమా డబ్బింగ్ సినిమా కావడంతో మరో స్ర్టెయిట్ మూవీకి మనమిద్దరం కలిసి పని చేయాలి అని అప్పట్లోనే చిరంజీవి మాటిచ్చారట మోహన్ రాజాకి. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకునేలా వున్నారనిపిస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ‘విశ్వంభర’ సినిమా త్వరలో షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆయన ముద్దుల తనయ సుస్మిత నిర్మాణంలో ఓ సినిమా చేయాల్సి వుంది.

ఈ సినిమాని ఆల్రెడీ అనౌన్స్ చేశారు కూడా. అయితే, చిన్న కరెక్షన్. ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాల్సి వుంది. కానీ, ఆ ప్లేస్‌లో మోహన్ రాజా చేరినట్లు టాలీవుడ్ గుసగుస. చూడాలి మరి, ఈ గుసగుసలో నిజమెంతో కానీ, మొత్తానికి మోహన్ రాజాతో చిరంజీవి మరో సినిమాకి బీజం అయితే పడినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com