ఇక మీదట టీజీఎస్ఆర్టీసీ .. టీఎస్ఆర్టీసీబస్సుకు పేరు మార్పు.
- May 22, 2024
టీఎస్ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది. అయితే ఉద్యమం సమయంలో టీజీని తెలంగాణవాదులు, ప్రజలు ఉపయోగించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా మార్చుతామని ప్రకటించింది. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







