ఈద్ అల్-అదా..కువైట్ లో గొర్రెలు కొరతకు చెక్..!
- May 22, 2024
కువైట్: ఈద్ అల్-అదాకు ముందు జోర్డాన్ నుండి 10,000 నైమి గొర్రెలు కువైట్ మార్కెట్ కు తరలిరానున్నాయి. 800 గొర్రెలతో మొదటి బ్యాచ్ త్వరలో దేశానికి వస్తుందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత తొలిసారిగా గొర్రెలు అబ్దల్లీ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశిస్తాయని అల్-వావాన్ లైవ్‌స్టాక్ అండ్ యానిమల్ ఫీడ్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మెనావర్ అల్-వావన్ తెలిపారు. కువైట్ మార్కెట్ లో గొర్రెల కొరత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈద్ అల్-అధా సందర్భంగా ఇది మరింత పెరుగుతుంది. ఈ కాలంలో తగినంత సరఫరాకు టర్కీ మరియు సిరియా నుండి మరిన్ని గొర్రెలను దిగుమతి చేసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు, దీనివల్ల ధరలు కనీసం 15 శాతం తగ్గుతాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్ లో రాయల్ కార్ల ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- నెలవారీ వాయిదాలలో ఫైన్స్, ఫీజులు చెల్లించవచ్చా?
- అగ్నిపర్వత బూడిదలో రేడియోధార్మిక పదార్థాలు ఉన్నాయా?
- రెండు రోజుల్లో 169 మోటార్ బైక్స్ సీజ్..!!
- ముగ్గురు ప్రైవేట్ ఆరోగ్య నిపుణుల లైసెన్స్ సస్పెండ్..!!
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?







