ఈద్ అల్-అదా..కువైట్ లో గొర్రెలు కొరతకు చెక్..!

- May 22, 2024 , by Maagulf
ఈద్ అల్-అదా..కువైట్ లో గొర్రెలు కొరతకు చెక్..!

కువైట్: ఈద్ అల్-అదాకు ముందు జోర్డాన్ నుండి 10,000 నైమి గొర్రెలు కువైట్ మార్కెట్ కు తరలిరానున్నాయి. 800 గొర్రెలతో మొదటి బ్యాచ్ త్వరలో దేశానికి వస్తుందని అధికారులు తెలిపారు.  1990 తర్వాత తొలిసారిగా గొర్రెలు అబ్దల్లీ సరిహద్దు గుండా దేశంలోకి ప్రవేశిస్తాయని అల్-వావాన్ లైవ్‌స్టాక్ అండ్ యానిమల్ ఫీడ్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మెనావర్ అల్-వావన్ తెలిపారు. కువైట్ మార్కెట్ లో గొర్రెల కొరత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈద్ అల్-అధా సందర్భంగా ఇది మరింత పెరుగుతుంది.  ఈ కాలంలో తగినంత సరఫరాకు టర్కీ మరియు సిరియా నుండి మరిన్ని గొర్రెలను దిగుమతి చేసుకోవాలని కూడా యోచిస్తున్నట్లు,  దీనివల్ల ధరలు కనీసం 15 శాతం తగ్గుతాయని ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com