విమానంలో 70,000 దిర్హామ్‌ల రోలెక్స్ చోరీ..!

- May 22, 2024 , by Maagulf
విమానంలో 70,000 దిర్హామ్‌ల రోలెక్స్ చోరీ..!

యూఏఈ: అబుదాబి నుండి దోహా మీదుగా రియాద్‌కు వెళుతుండగా తన బ్యాగ్‌లో ఉన్న నగదు, రోలెక్స్ కనిపించకుండా పోయిందని యూఏఈ మాజీ నివాసి అర్సలాన్ హమీద్ తెలిపారు. తన బ్యాగ్‌ని ఓవర్‌హెడ్ బిన్‌లో పెట్టినట్లు గుర్తుచేశారు. అనంతరం పడుకున్నట్లు తెలిపారు. ఇంటికి చేరుకుని చూసుకుంటే 73,000 దిర్హామ్ విలువైన వాచ్, అలాగే SAR3,000 విలువైన నగదు, GBP260 (సుమారు Dh4,000) చోరీ అయినట్లు గుర్తించినట్లు వివరించాడు. ఈ తరహా సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ, యూఏఈ ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసుకున్నాడు. షార్జా నివాసి ముహమ్మద్ సల్మాన్ లఖానీ కూడా అలాంటి బాధితుల్లో ఒకరు. ఈ సంవత్సరం మేలో రియాద్ నుండి దుబాయ్‌కి వచ్చే క్రమంలో తన కార్డులలో ఒకటి Dh18,803 మోసపూరిత లావాదేవీ జరిగిందని వివరించాడు. విమానం దిగాక తన క్యారీ-ఆన్ బ్యాగ్‌ని తనిఖీ చేసినప్పుడు, కార్డులు (15 క్రెడిట్ మరియు ఐదు డెబిట్)తో పాటు $1,900 నగదు కనిపించడం లేదని పేర్కొన్నాడు. ఇలాంటి సందర్భాల్లో ఫ్లైట్ సిబ్బందికి తెలిజేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగానే బ్యాగ్ లను తనిఖీ చేయాలని, చోరీ విషయాన్ని కెప్టెన్ కు తెలియజేయాలని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకోవాలని కెప్టెన్ గ్రౌండ్‌లోని సెక్యూరిటీకి తెలియజేస్తాడని నిపుణులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com