చిన్న దేవరకొండ.! ప్రేక్షకుల మనసులు దోచేస్తాడా.?

- May 23, 2024 , by Maagulf
చిన్న దేవరకొండ.! ప్రేక్షకుల మనసులు దోచేస్తాడా.?

చిన్న దేవరకొండ.. అదేనండీ.! విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘గం గం గణేశా’ రిలీజ్‌కొచ్చింది. ఈ నెల 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

‘బేబీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు. ‘బేబీ’ సినిమాలో సెటిల్డ్ పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు తనలోని హ్యూమరస్ యాంగిల్‌ని బయటపెట్టబోతున్నాడు.

కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కి మంచి రెస్సాన్సే వస్తోంది. గణపతి విగ్రహం చుట్టూ జరిగే ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ స్టోరీగా ‘గంగంగణేశా’ అనిపిస్తోంది. కామెడీతో పాటూ, యాక్షన్.. అలాగే కొన్ని థ్రిల్లింగ్ అంశాలూ ఆకట్టుకునేలానే వున్నాయ్.

అన్నట్లు ఈ సినిమాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అయిన ప్రిన్స్ యావర్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. హాలీడేస్ సీజన్ ఎండింగ్‌లో వస్తున్న ‘గంగంగణేశా’ ఆనంద్ దేవరకొండకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com