#NKR21.! కళ్యాణ్ రామ్ పవర్ పంచ్.!

- May 28, 2024 , by Maagulf
#NKR21.! కళ్యాణ్ రామ్ పవర్ పంచ్.!

కళ్యాణ్ రామ్ ఇటీవలి కాలంలో భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా కెరీర్‌ని ఓ పద్ధతిలో నడిపిస్తున్నాడు. తాజాగా ఆయన తన 21 వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అశోకా క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి  తన హోమ్ బ్యానర్ అయిన ఎన్టీయార్ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. కాగా లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ సినిమా గ్లింప్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేలా వుంది. మోస్ట్ పవర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్ ఈ గ్లింప్స్‌లో. సినిమానీ చాలా గ్రాండియర్ లుక్‌లో తెరకెక్కించబోతున్నారని తాజా గ్లింప్స్ చూస్తే అర్ధమవుతోంది.

అలాగే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి ఓ కీలకమైన పాత్ర పోషించబోతోందని తెలుస్తోంది. ‘కర్తవ్యం’ సినిమాలో మాదిరి ఓ పవర్ ఫుల్ రోల్ అనీ ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీలా తోస్తోంది. చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com