లైసెన్స్‌ లేని టూరిజం ఫెసిలిటీ మూసివేత

- June 10, 2016 , by Maagulf
లైసెన్స్‌ లేని టూరిజం ఫెసిలిటీ మూసివేత



పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌, నార్తరన్‌ గవర్నరేట్‌ పరిధిలోని టూరిజం వెన్యూని మూసివేయాల్సిందిగా ఆదేశించింది. క్యాపిటల్‌ అడ్వొకేట్‌ జనరల్‌ నవాజ్‌ అల్‌ అవధి, బహ్రెయిన్‌ అథారిటీ ఫర్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ (బిఎటిఇ) నోటిఫికేషన్‌ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. సదరు టూరిజం వెన్యూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడ్తోందని, లైసెన్స్‌ లేకుండా నడుపుతున్నారనీ ఆయన చెప్పారు. బిఎటిఇ ఈ మూసివేతను పర్యవేక్షిస్తుంది. జనరల్‌ డైరెక్టరేట్‌ ఫర్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ మరియు ఫోరెన్సిక్‌ ఎవిడెన్స్‌ కూడా బిఎటిఇతో కలిసి పనిచేస్తుంది. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోవాలనీ, విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com