కొత్త యువరాజుకు భారత రాయబారి శుభాకాంక్షలు

- June 03, 2024 , by Maagulf
కొత్త యువరాజుకు భారత రాయబారి శుభాకాంక్షలు

కువైట్: కువైట్ క్రౌన్ ప్రిన్స్ గా బాధ్యతలు స్వీకరించిన హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాను కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా అభినందనలు తెలిపారు. ఇండియా, కువైట్ మధ్య చారిత్రాత్మక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు రాయబారి తెలిపారు. "కువైట్ రాష్ట్ర యువరాజుగా బాధ్యతలు స్వీకరించినందుకు షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. 4 దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్న హిస్ హైనెస్ ది క్రౌన్ భవిష్యత్తులో దేశాన్ని నడిపించడానికి ప్రిన్స్ తనతో పాటు గొప్ప అనుభవాన్ని తీసుకొస్తారని భావిస్తున్నాను. భారతదేశం మరియు కువైట్ మధ్య చారిత్రాత్మకమైన , బహుముఖ సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. ’’ అని రాయబారి తన సందేశంలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com