రామ్ చరణ్ సరసన కృతి శెట్టి?

- June 03, 2024 , by Maagulf
రామ్ చరణ్ సరసన కృతి శెట్టి?

అన్నీ కలిసొస్తే.. ఈ పాటికే బేబమ్మ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఛాన్స్ దక్కించుకుని వుండేది. అమ్మడి ఎంట్రీనే మెగా ఫ్యామిలీ నుంచి జరిగింది మరి.
అయితే, కెరీర్ మధ్యలోనే డ్రాప్ అయిపోవడంతో ఆ కల ఇంతవరకూ నెరవేరలేదు. అన్నట్లు ఇంతకీ రామ్ చరణ్ - కృతి శెట్టి కాంబినేషన్ ఎందుకు చర్చకొచ్చిందంటారా.?
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కృతి శెట్టి కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ‘మనమే’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి రామ్ చరణ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు.
ఈ ఈవెంట్‌లోనే తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని... అందరితోనూ బాగా కలిసిపోతారనీ, ఎవ్వరితోనైనా చాలా రెస్పెక్ట్‌గా వుంటారనీ, డెడికేటెడ్ అనీ.. ఇలా ఆయనపై తనకున్న అభిమానాన్ని వెల్లబుచ్చుకుంది అందాల బేబమ్మ కృతి శెట్టి.
ఈ ఎగ్జైట్‌మెంట్‌లోనే తనకు రామ్ చరణ్‌ సినిమాలో ఛాన్సొస్తే.. చాలా హ్యాపీ ఫీలవుతానని కూడా చెప్పేసింది. అన్ని కుదిరి క్రేజ్‌తో పాటూ, సక్సెస్ కూడా తోడై వుండి వుంటే.. ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న ఏదో ఒక ప్రాజెక్ట్‌లో ఖచ్చితంగా కృతి శెట్టి హీరోయిన్ అయ్యుండేది. ఏమో, చూడాలి మరి, ‘మనమే’ హిట్టయితే మళ్లీ కృతి శెట్టి కమ్ బ్యాక్ అవుతుంది.
అలా రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల్లో ఛాన్స్ దక్కించుకుంటుందేమో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com