క్వీన్ కంగనా ఇకపై రాజకీయ ఎత్తుగడల్లోనూ బిజీ కానుంది.!

- June 05, 2024 , by Maagulf
క్వీన్ కంగనా ఇకపై రాజకీయ ఎత్తుగడల్లోనూ బిజీ కానుంది.!

బాలీవుడ్ క్వీన్ పంచ్ స్టార్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె నోటికి పదునెక్కువ. మాటలకు దురుసెక్కువ. వున్నది వున్నట్లుగా కాస్త గట్టిగానే చెప్పేస్తుంటుంది. గతంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేసి పలు వివాదాల్లోనూ చిక్కుకుంది కూడా.

ఇప్పుడు ఈ లేడీ పవర్ పంచ్ స్టార్ రాజకీయాల్లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ట్ అభ్యర్ధిపై ఘనమైన మెజార్టీతో విజయం సాధించింది కంగనా రనౌత్.

హిమాచల ప్రదేశ్‌లోని కంగనా స్వస్థలమైన మండి నుంచి కంగనా పోటీ చేసింది. భారీ విజయం దక్కించుకుంది. ఇకపై రాజకీయాల్లో తన సత్తా చాటుతానంటోంది. ఆమె చురుకైన, పదునైన మాటలతో ప్రభుత్వంలోని తప్పొప్పుల్ని ప్రశ్నిస్తానంటోంది. ప్రజలకు తన వంతు సాయం చేస్తానంటోంది.

చూడాలి మరి, సినిమాల్లో ఆల్రెడీ కంగనా రనౌత్ తానేంటో ప్రూవ్ చేసేసుకుంది. ఇక రాజకీయాల్లో ఆమె సేవలు ఎలా వుండబోతున్నాయో తన స్టార్‌డమ్‌ని రాజకీయాల్లో ఎలా వుపయోగించబోతోందో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com