కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు

- July 02, 2015 , by Maagulf
కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు


కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు ముఖ్యంగా ఆహర విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారికి తాము తీసుకునే ఆహారంలో వారికి తెలియకుండానే కిడ్నీలకు చెడు చేసే అనేక రకాల కారకాలు ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తినడం చాలా తగ్గించాలి. శాఖాహారంలో ప్రోటీన్లు, మాంసాహారంతో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కాబట్టి శాఖాహారం ఎక్కువగా తీసుకోవాలి. అయితే కొన్ని రకాల కూరగాయల్లో కూడా అధిక ప్రోటీన్లు ఉంటాయి. కాబట్టి అవి గమనించుకొని వాడాలి. అంతేకాదు పోటాషియం కూరగాయల్లో ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు మన శరీరంలోని పొటాషియంను బయటికి పంపడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. కాబట్టి వీరు తినే ఆహారంలో పొటాషియం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. శుభ్రం చేయని కూరగాయల్లో పొటాషియం శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే కూరగాయలిన చిన్న చిన్న ముక్కలుగా కోసి, 20 నిముషాలు నీటిలో నానిన తరువాత వండుకుని తినాలి. ప్రోటీన్లు లభించని ఆహారం తీసుకోకపోతే శరీరానికి పోషకాహార లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వాటి స్థానంలో పోషకాలు ఎక్కువగా ఉండే పళ్లు, పిండిపదార్ధాలు ఎక్కువగా ఉండే కొన్నిరకాల మాంసకృత్తులు పాలు, గుడ్డులోని తెల్ల సొన వంటివి ఎక్కువగా తీసుకోవాలి. కొవ్వును కలిగించే నూనె, నెయ్యి వంటి వాటిని మితంగా వాడాలి. సాధారణంగా హై బీపీ ఉన్నవాళ్లే ఉప్పు తక్కువ తినాలని అంటుంటారు. కానీ కిడ్నీ సమస్యలున్నవాళ్లు కూడా ఉప్పు తక్కువగా తినడం మంచిది. కిడ్నీ సమస్యలు ఏ దశలో ఉన్నా సరే ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com