బంగారు తెలంగాణ
- July 02, 2015
తెలంగాణ తమ్ములారా అలుపెరుగని అన్నలారా
తెలంగాణ బిడ్డ లారా పది జిల్లల పౌరు లారా -2
చేయి చేయి కలిపి మనం భాయి భాయి అనుకుంటూ
సాధించిన తెలంగాణ సాగు చేసి సాన బెట్టి
బంగారు తెలంగాణ రాష్ట్రము జేద్దాము రండ్రి llతెలంగాణll
అరవైయేళ్లు అణిగిపోయి గతితప్పిన బతుకు మనది
ఒళ్ళంతా ఎండి పోయిన పదిజిల్లల తల్లి మనది
మన బతుకులు మంచిగయ్యి మన తల్లీ ఆరోగ్యము
మెరుగుపడే పనులు కలిసి మెలిసీ జేద్దాము రండ్రి llతెలంగాణll
బోరు బావులల్ల నీరు ఎండి పోగ బోరుమంటు
ఏడ్చి ఏడ్చి ఎండి పోయిన రైతన్నల చేoడ్లలోకి
ఊరూరా చెరువుల్లో పూటికలను తీసుకుంటు
జోరుగా పారేటి నీటి కాల్వలు తవ్వుదాము రండ్రి llతెలంగాణll
అప్పు దీర్చ లేక ఆత్మ హత్యలకు పాల్పడిన
అన్నదాతలున్న ఊర్ల కెల్లి వారి నూరడించి
కష్టాల వెనకున్న కారణాలు వెదికి వారి
నష్టాలను పూరించ నడుములు కడదాము రండ్రి llతెలంగాణll
తగినన్ని డిగ్రీలు చేత బట్టుకున్న గాని
తగిన ఒక్క ఉద్యోగము దొరక లేక తిరుగాడుతు
బతుకు బండి మోయలేక చతికిల బడుతున్న వార్ని
వెతికి లేపి వారి కొక్క ఆసర ఇద్దాము రండ్రి llతెలంగాణll
లంచ మడుగు తున్న వారి పంచెలూడ దీస్త మంటు
దంచి కొడుతు రోడ్డు మీద ఎండ లోన కూసొ బెట్టి
కంచ మందు పాత నోట్ల కట్టా నొక్కటి వేసి
మంచి నీళ్ళు ఇచ్చి నమిలి మింగీ పిద్దాము రండ్రి llతెలంగాణll
ఆడ పిల్లల జీవితాలతో ఆడుకున్న కీచకులను
మెడలు వంచి రెక్క లిరిసి మొగ మంతా మసి పూసి
బోడ గుండ్లు గీసి వార్ని గాడిద పై ఎక్కించి
వాడ వాడకూ దిప్పి పేడలు గొడదాము రండ్రి llతెలంగాణll
ఆలు బిడ్డలు అన్నదమ్ములు అందరినీ ఒదిలేసీ
అరబు దేశముల కెళ్ళి అగచాట్లు పడుతున్న
అమాయకులకు అండనిచ్చి మోసగాళ్ళ నెండగొడుతు
మోసాలను రూపుమాపు మార్గము వేద్దాము రండ్రి llతెలంగాణll
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతంటు
స్వచ్ఛ భారత్ నినాదముతో పీయెమ్మే పిలుపియ్యగ
మంత్రులతో బయలుదేరి సీయెమ్ చెత్తెత్తు తుంటే
స్వచ్ఛ తెలంగాణ జేయ చీపురుపడదాము రండ్రి llతెలంగాణll
…నక్క భాస్కర రావు(అబుధాబి)
తేది: 2. 6. 2015
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







