జూన్ 17న కంట్రోల్‌ సి చిత్రం విడుదల ..

- June 11, 2016 , by Maagulf
జూన్ 17న కంట్రోల్‌ సి  చిత్రం విడుదల ..

అశోక్,దిశాపాండే హీరో,హీరోయిన్‌గా, సెకండ్ ఇండిపెండన్స్ టాకీస్ బ్యానర్‌పై సాయిరామ్ చల్లా దర్శకత్వంలో, ప్రభాకర్ రెడ్డి నిర్మాతగా నిర్మిస్తున్న కంట్రోల్ సి చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 17న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్బంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ చిన్న చిత్రమైన ఖర్చుకు వెనకాడకుండా ఫుల్ క్వాలీటీతో చిత్రాన్ని తెరకెక్కించారు.
దర్శకుడు సాయి రామ్ చల్లా నాకు ఆర్య చిత్రం దగ్గర నుండి తెలుసు. సాఫ్ట్ వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. అంత పెద్ద ఉద్యోగాన్ని వదిలి దర్శకుడు కావాలని నా దగ్గరకు వచ్చి ఒక కథ ను చెప్పాడు. 100 కోట్ల సినిమా అవుతుంది.

ముందు చిన్న చిత్రం చేయమని చెప్పాను. అప్పుడు ఈ చిత్రం కథను తయారు చేసుకోచ్చాడు. సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్‌లో చిత్రాన్ని తీశారు. కొత్త దర్శకుడు అని ఒక్క ఫ్రేమ్‌లో కూడా అనిపించలేదు.

20 ఏళ్ల అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని తెరకెక్కించారు. పెద్ద ఆర్టిస్ట్‌లను ఈ చిత్రంలో నటించారు అన్నారు. దర్శకుడు సాయి రామ్ చల్లా మాట్లాడుతూ సుకుమార్ గారితో ఆర్య చిత్రం నుండి పరిచయం. అప్పటి నుండి దర్శకుడు అవ్వాలనుకున్నాను.

12 ఏళ్లుగా సుకుమార్ గారితో కలసి జర్నీ చేస్తున్నాను. నా ప్రతి స్టేజ్‌లోను నన్ను సపోర్ట్ చేశారు. సుకుమార్‌గారి ఈ చిత్రం కథ చెప్పాగానే నచ్చింది. ఇండియన్ చిత్రాల్లో ఉండే రెగ్యులర్ ఫార్మాట్ ఈ చిత్రంలో ఉండదు.

ఈ చిత్రానికి కథే హీరో. కథే పాత్రలను నడిపిస్తుంది. ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు అందులోనుండి బయట పడ్డ ఒక ప్రేమ జంటకు ఒక సిడి దొరుకుతుంది. ఆ సిడి ఆ ప్రేమికుల జీవితాల్లో ఎలాంటి మార్పులను తీసుకువచ్చిందనేదే ఈ చిత్రం.

జూన్ 17న ఈ చిత్రం విడుదల అవుతుంది అన్నారు. నిర్మాత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిగ్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు. సాఫ్ట్ వేర్ థ్రిల్లర్ మూవీ. చిత్ర పరిశ్రమలో మాకు అనుభవం లేకున్న మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేసిన సుకుమార్ గారి థ్యాంక్స్ అన్నారు.

ఈ కార్యక్రమంలో హేమ, చంద్రమహేష్, బెనర్జీ, సమీర్ తదితరులు పాల్గోన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com