దిక్కులు చూడకుండా’ బిగ్‌బాస్ ఓటీటీ చూడమంటోన్న ముద్దుగుమ్మ.!

- June 22, 2024 , by Maagulf
దిక్కులు చూడకుండా’ బిగ్‌బాస్ ఓటీటీ చూడమంటోన్న ముద్దుగుమ్మ.!

‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? పేరు సనా మక్భూల్. ఈ సినిమాలో ఇంద్రజతో పాటూ సెకండ్ హీరోయిన్‌గా నటించింది. నిజానికి ఈ ముద్దుగుమ్మే మెయిన్ లీడ్ అని చెప్పొచ్చు.

తండ్రీ కొడుకులిద్దరినీ ప్రేమించే అమ్మాయిగా ఈ సినిమాలో సనా మక్భూల్ పాత్ర అద్భుతంగా తీర్చి దిద్దాడు డైరెక్టర్. ఆ పాత్రలో తనవంతు పర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకుంది సనా మక్భూల్.

సినిమా స్టోరీ కూడా అందర్నీ ఆలోచింపచేసేలా వుంటుంది. అప్పట్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కూడా. సనా మక్బూల్ పేరు కూడా బాగానే వినిపించింది. కానీ, అవకాశాలే పెద్దగా దక్కించుకోలేకపోయిందీ అందాల భామ.

తనకున్న అందంతో సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ వుండేది. ఈ మధ్య కొంతకాలంగా సనా మక్భూల్ కనిపించడం లేదు నెట్టింట్లో కూడా.

అయితే, ఇక నుంచి ఈ ముద్దుగుమ్మ ట్రెండింగ్ కానుంది మళ్లీ. హిందీ బిగ్‌బాస్ ఓటీటీలో సనా మక్బూల్ ఓ కంటెస్టెంట్‌గా వెళ్లబోతోంది. బిగ్‌బాస్ షోకి ఎప్పుడూ క్రేజే. అందులోని కంటెస్టెంట్లకు కూడా.

ఇక, ఓటీటీ కంటెస్టెంట్లంటే మరీను. సో, మళ్లీ సనా మక్బూల్ టైమ్ వచ్చినట్లే అని చెప్పుకోవచ్చు. పాప టాలెంట్ చూడాలంటే త్వరలో ప్రసారం కాబోయే హిందీ ఓటీటీ బిగ్‌బాస్ వీక్షిస్తే సరిపోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com