దీపికా పదుకొనె తెలుగులో నెక్స్ట్ సూపర్ స్టార్తోనేనా.?
- June 29, 2024
‘కల్కి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన దీపికా పదుకొనె తెలుగు జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పోషించిన సుమతి పాత్ర తెలుగు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో, బాగా ఓన్ చేసుకున్నారు దీపిక పదుకొనెని తెలుగు జనం.
ఆల్రెడీ దీపికకు ‘పద్మావత్’ తదితర తెలుగు డబ్బింగ్ సినిమాలతోనూ టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ వుంది. ఇప్పుడు స్ర్టెయిట్గా నటించిన ‘కల్కి’ సూపర్ హిట్ అయ్యింది. దాంతో, తెలుగులో మరిన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయన్న సమాచారం అందుతోంది.
అందులో ముఖ్యంగా భారీ బడ్జెట్ మూవీ జక్కన్న క్రియేటివ్ వరల్డ్ నుంచి రాబోతున్న ప్రాజెక్టులో దీపికా పదుకొనె హీరోయిన్గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనె పేరు పరిశీలనకొచ్చిందట. గతంలోనే దీపిక పేరు లిస్టులో వున్నప్పటికీ అది ఇప్పుడు ఇంకాస్త బలపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే తెలుగులో దీపిక హవా మొదలైనట్లే.!
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







