డ్రోన్ కారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అలజడి
- June 12, 2016
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓ డ్రోన్ కారణంగా ఒక గంటపాటు తాత్కాలికంగా మూసివేయబడింది. అనధికారిక ద్రోన్ ఒకటి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్‌స్పేస్‌లోకి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. దాంతో 11.36 నిమిషాల నుంచి 12.45 నిమిషాల వరకు విమాన సేవల్ని ఈ ఎయిర్‌పోర్ట్‌లో తాత్కాలికంగా నిలిపివేశారు. సమీపంలోని ఎయిర్‌పోర్ట్‌లకు విమానాల్ని మళ్ళించారు. చాలా విమానాల వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనధికారికంగా దూసుకొచ్చిన ఆ డ్రోన్‌కి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ యంత్రాంగం డ్రోన్ల వినియోగంపై వున్న నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే నిర్ణయానికి వచ్చింది. డ్రోన్ల వినియోగంపై కఠినమైన నిబంధనలున్నప్పటికీ ఒక్కోసారి అవగాహనా లోపంతో డ్రోన్ నిర్వాహకులు తప్పిదాలకు పాల్పడుతున్నారు. డ్రోన్ల ద్వారా ఎలాంటి డ్యామేజీకీ పాల్పడకూడదు. డ్రోన్ ఆపరేటర్ దాని కారణంగా జరిగే ఇబ్బందులకు చట్టబద్ధంగా బాధ్యుడవుతాడు. ఎయిర్పోర్ట్ లేదా ల్యాండింగ్ ఏరియా పరిధిలో సుమారు 5 కిలోమీటర్ల మేర డ్రోన్ల వినియోగం నేరం. డ్రోన్ వినియోగించేటప్పుడు అది పూర్తి కండిషన్లో ఉందో లేదో చూసుకోవాలి. డ్రోన్లకు కమెరాలను వినియోగించడంపై అధికారిక వర్గాల నుంచి పర్మిషన్ తప్పనిసరి. ఫొటోలు లేదా వీడియోలను చిత్రీకరించేటప్పుడు ఏ వ్యక్తి యొక్క ప్రైవసీకి భంగం వాటిల్లరాదు. వీటన్నిటినీ గుర్తుంచుకుని డ్రోన్ ఆపరేటర్లు వ్యవహరించాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









