‘స్టెప్పా మార్.! రామ్ పోతినేని’ డబుల్ ‘మాస్’ ఇస్మార్ట్.!
- July 02, 2024
‘ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కమ్ బ్యాక్ అయిన స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. తర్వాత ‘లైగర్’ సినిమాతో మళ్లీ దెబ్బ తిన్నప్పటికీ సక్సెస్ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకి తిరుగులేని కాన్ఫిడెన్స్‌తో సీక్వెల్ రూపొందించాడు. అదే ‘డబుల్ ఇస్మార్ట్’.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. స్రైకింగ్ డేట్ ఆగస్ట్ 15న ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ‘స్టెప్పా మార్’ అనే లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్లు.
ఆల్రెడీ ఇస్మార్ట్ శంకర్’లోనే వేరే లెవల్ మాస్ చూపించేసిన పూరీ జగన్నాధ్, ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం ఏకంగా మాస్‌కే మాస్ అనేలా రామ్ పోతినేనిని చూపించబోతున్నాడని తెలుస్తోంది.
అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా వుంది ‘స్టెప్పా మార్..’ సాంగ్. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్‌కి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. ‘ఇస్మార్ట్ శంకర్’లోని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయ్. అంతకు మించి అనేలా మ్యూజిక్ కొట్టాడనిపిస్తోంది.
అందుకు తగ్గట్లే రామ్ పోతినేనితో మాస్ స్టెప్పులేయించేశాడు జానీ మాస్టర్. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమాని ఛార్మి నిర్మిస్తుండగా, కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







