‘కల్కి2898ఏడీ’ విజయ్ దేవరకొండకి జాక్‌పాటే.!
- July 02, 2024
‘కల్కి’ సినిమాలో ప్రబాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితర కీలక నటీనటులతో పాటూ, కొన్ని స్టన్నింగ్ అండ్ సర్ప్రైజ్ పాత్రలు కూడా పోషించారు కొందరు స్టార్ సెలబ్రిటీలు.
అందులో జక్కన్న రాజమౌళి, ‘జాతిరత్నాలు’ ఫేమ్ డైరెక్టర్ అనుదీప్, సంచలన దర్శకుడు రామ్ గోపాలవ్ వర్మ, హీరోయిన్ ఫరియా అబ్ధుల్లా, మాళవిక నాయర్, సీనియర్ నటి శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు వున్నారు.
వీరితో పాటూ, సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా వున్నాడు. విజయ్ దేవరకొండ సినిమాకి కీలకమైన అర్జునుడి పాత్రలో కనిపించిన సంగతి సినిమా చూసిన వాళ్లకీ, వినిన వాళ్లకీ తెలిసిన సంగతే.
ఈ సినిమా చివరిలో వచ్చే అర్జునుడి పాత్ర సెకండ్ పార్ట్‌కి ఓ టర్నింగ్ పాయింట్లా అనిపిస్తుంది. కొన్ని నిమిషాల పాటే కనిపించినా హిట్టు టేస్ట్ చూసి చాలా కాలమైన విజయ్ దేవరకొండకి ఈ పాత్ర అలాగే ‘కల్కి’ సినిమా నిజంగా జాక్ పాటే అని చెప్పాలి.
అయితే, ఈ పాత్రకి సంబంధించి కొంత నెగిటివిటీ కూడా అల్లుకుంది. అయినా కానీ, సెకండ్ పార్ట్‌లో విజయ్ దేవరకొండ పాత్రకి ఇంకాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ వుంటుందని అంటున్నారు. చూడాలి మరి. వచ్చే ఏడాది కాదు, ఆ పై వచ్చే ఏడాది (2026)లో ‘కల్కి 2’ రానుంది.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







