‘ఏజెంట్’ అప్డేట్.! అక్కడైనా నిజమేనా.?
- July 02, 2024
అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా వచ్చిన సినిమా ‘ఏజెంట్’. భారీ బడ్జెట్‌తో అతి భారీ ప్రమోషన్లతో రూపొందిన ఈ సినిమా రిలీజ్ తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. ఎంత దారుణం అంటే, ఇంతవరకూ ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి కూడా నోచుకోకపోవడం గమనార్హం.
ఏ పేరూ పొద్దూ లేని చిన్న సినిమాలు సైతం రిలీజ్ తర్వాత 15 రోజుల నుంచి నెల రోజుల లోపటే ఓటీటీలో రిలీజవుతున్న రోజులివి. కంటెంట్ బాగుంటే, ధియేటర్లలో ఫెయిలైనా ఓటీటీ జనంతో ప్రశంసలు గుప్పించుకుంటున్నాయ్ కొన్ని సినిమాలు.
అలాంటిది అంత పెద్ద స్టార్ కిడ్ అయ్యుండి కూడా అఖిల్ తన సినిమాని ఇంతవరకూ ఓటీటీలో రిలీజ్ చేసుకోలేకపోయాడు. ఇదిగో అదిగో అంటూ సోనీ లివ్ హక్కులు దక్కించుకుందంటూ వార్తలు వినిపించాయ్. కానీ, అది జరగలేదు.
అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఈ సినిమాని టీవీలో రిలీజ్ చేస్తున్నారన్న టాక్ బయటికొచ్చింది. అది కూడా రెగ్యులర్ టీవీ ఛానెల్ కాదండోయ్. గోల్డ్ మైన్ ఛానెల్ అనే టీవీలో రాబోతోందట. అయితే, ఎప్పుడు.? ఏంటి.? అనేది ఇంకా క్లారిటీ లేదు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!







