ఏలూరు జిల్లాలో NATS మెగా ఉచిత వైద్య శిబిరం
- July 08, 2024
అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగునాట కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేసింది. దీనిలో భాగంగానే తాజాగా ఏలూరు జిల్లా వట్లూరు గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చొరవతో నాట్స్, ఏలూరు హేలపుర రూరల్ లయన్స్ క్లబ్ సంస్థలు సంయుక్తంగా ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఆయుష్ హాస్పిటల్స్, శంకర్ నేత్రాలయల సహకారంతో జరిగిన మెగా వైద్య శిబిరంలో దాదాపు 160 మంది రోగులకు ఉచితంగా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. శంకర్ నేత్రాలయం కంటి పరీక్షలు నిర్వహించింది. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు కూడా రోగులకు పంపిణీ చేశారు. రోగుల ఆరోగ్యం గురించి ఈ శిబిరంలో వైద్యులు విలువైన సూచనలు చేశారు. పేద రోగుల కోసం ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సొంత డబ్బులతో నిర్వహించిన నాట్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్లను స్థానికులు అభినందించారు. సొంత ఊరుకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేద రోగులకు ఉపయోగపడేలా చేయడంపై రోగులు ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ మెగా వైద్య శిబిరం నిర్వహణలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ మెగా వైద్య శిబిరానికి సహకరించిన నాట్స్ నాయకులు రాజేశ్ కాండ్రు, మురళీకృష్ణ మేడిచెర్లకు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







