‘ఓదెల 2’కి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తమన్నానే కీలకం.!

- July 29, 2024 , by Maagulf
‘ఓదెల 2’కి ఎక్స్‌పెక్టేషన్స్‌కి తమన్నానే కీలకం.!

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ఎప్పుడూ బిజీ బిజీనే. హీరోయిన్‌గా కాకపోయినా స్పెషల్ సాంగ్స్‌తో అయినా నెట్టుకొచ్చేస్తుంటుంది. అలాంటిది తమన్నా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా వుంది. ఓ వైపు ‘ఓదెల 2’ సినిమాతో బిజీగా వుంది.

ఈ సినిమాలో తమన్నా శివ శక్తి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కోసం తమన్నా డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన బోనాల పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.

సంపత్ నంది కథ అందించిన ఈ సినిమాలో హెబ్బా పటేల్ సెకండ్ లీడ్ పోషిస్తుండగా తమన్నా మెయిన్ లీడ్ పోషిస్తోంది. గతంలో జస్ట్ ఓటీటీ కంటెంట్‌గా రిలీజైన ‘ఓదెల రైల్వేస్టేషన్’‌కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

 ‘ఓదెల రైల్వేస్టేషన్’ కోసం హెబ్బా పటేల్ డీగ్లామర్ లుక్స్‌లో శభాష్ అనే నటన కనిబరిచింది. ఆ సినిమాకి సీక్వెల్‌గానే వస్తున్న ఈ సినిమాలో తమన్నాని మెయిన్ లీడ్‌లో పవర్ ఫుల్ రోల్‌లో చూపించేందుకు ఆ క్యారెక్టర్ డిజైన్ చేశాడు సంపత్ నంది.

తొలి పార్ట్ ఓటీటీలో రిలీజైనప్పటికీ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ఓటీటీ ప్రేక్షకులకు ఓ స్పెషల్ ట్రీట్ ఇచ్చిందీ సినిమా. అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ‘ఓదెల 2’పై మంచి అంచనాలున్నాయ్. అందులోనూ తమన్నా లీడ్ అంటే ఆ అంచనాలు ఇంకాస్త ఎక్కువయ్యాయ్. చూడాలి మరి, ఆ అంచనాల్ని తమన్నా అందుకుంటుందో లేదో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com