రామ్ పోతినేని నెక్స్‌ట్ ఎవరితోనో తెలుసా.?

- July 29, 2024 , by Maagulf
రామ్ పోతినేని నెక్స్‌ట్ ఎవరితోనో తెలుసా.?

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు మహేష్ బాబు.పి. తొలి సినిమానే అయినా స్టార్ హీరోయిన్ అనుష్కని, ట్రెండింగ్ యంగ్ స్టర్ నవీన్ పోలిశెట్టినీ మ్యాచ్ చేసి అల్లుకున్న కథని తెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది.

ఇప్పుడు మరో కొత్త కథతో రాబోతున్నాడట ఈ యంగ్ డైరెక్టర్. ఈ సారి మాస్ హీరో రామ్ పోతినేనికి తన కథ వినిపించాడట. అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చిందట రామ్ నుంచి.

త్వరలోనే ఈ స్టోరీని సెట్స్‌ మీదికి తీసుకెళ్దామని హామీ ఇచ్చాడట రామ్ పోతినేని. బహుశా సెప్టెంబర్‌లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందనీ తెలుస్తోంది. మరోవైపు రామ్ పోతినేని ప్రస్తుతం ‘ డబుల్ ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బిజీగా వున్నాడు.

ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్‌కి జోడీగా కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీగా కాకపోయినా ఓ మోస్తరు అంచనాలున్నాయ్.

అన్నట్లు ఇదే డేట్‌కి మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ కూడా రిలీజ్ అవుతుండడంతో ఆ సినిమాకి టాక్ ఏమాత్రం తేడా వచ్చినా అది ఈ సినిమాకి కలిసొచ్చే అవకాశముందని రామ్ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com