నాని ‘శనివారం’ ప్రమోషన్లు పోలా.! అదిరిపోలా.!

- July 29, 2024 , by Maagulf
నాని ‘శనివారం’ ప్రమోషన్లు పోలా.! అదిరిపోలా.!

‘సరిపోదా శనివారం’ అంటూ నాని ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. ఆగస్టు 29న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఇది.

డివివి దానయ్య, దాసరి కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి పోస్టర్ నుంచీ ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తూనే వుంది. డిఫరెంట్ వేరియేషన్స్‌లో నాని కనిపిస్తున్నాడీ సినిమాలో.

ఈ మధ్యనే సినిమా ప్రమోషన్లు వేగవంతం చేశారు. అందులో భాగంగానే ప్రతీ శనివారం నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ఏధో ఒక అప్డేట్ వదులుతున్నారు. ఈ శనివారం అప్డేట్‌లో భాగంగా సినిమాలోని కీలక ప్రాతల పేర్లు పరిచయం చేస్తూ వదిలిని అప్డేట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

అలాగే వచ్చే శనివారం మరో క్రేజీ అప్డేట్ వదలబోతున్నారట. చాలా సర్‌ప్రైజింగ్‌గా వుండబోతోందటది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత శనివారం ప్రియాంక పోలీస్ డ్రస్‌లో వున్న పోస్టర్ రిలీజ్ చేసి, ఆమె పాత్రని రివీల్ చేశారు. ఇలా ఈ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఇంకెన్ని అప్డేట్స్ రాబోతున్నాయో ఇంట్రెస్టింగ్‌గా చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com