‘దేవర’ కి జాన్వీ స్టామినా సరిపోతుందా.?
- July 29, 2024
సెప్టెంబర్‌లో ‘దేవర’ రిలీజ్‌కి సిద్ధంగా వుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ‘దేవర’ నుంచి మరో కొత్త అప్డేట్ ఏదో ఒకటి రావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ వచ్చాయ్. ఇవి ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయ్. వీటికి మించిన మరో అప్డేట్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆగస్టులో ఏదో ఒక అప్డేట్ పక్కాగా రిలీజ్ చేసేందుకు ‘దేవర’ టీమ్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతన్న ఈ సినిమాకి సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
జాన్వీ కపూర్ ఇమేజ్ బాలీవుడ్లో ఈ సినిమా నిలదొక్కుకోవడానికి సరిపోతుందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ఎందుకంటే జాన్వీ కపూర్‌కి క్రేజ్ వున్న సంగతి వాస్తవమే. కానీ, ఇంతవరకూ జాన్వీ నటించిన ఏ సినిమా కూడా బాలీవుడ్లో సెన్సేషన్ విజయం అందుకున్న దాఖలాల్లేవ్.
హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌నే ఇంతవరకూ ఎంచుకుంటూ వచ్చింది జాన్వీ కపూర్. అవన్నీ ఆమె పాత్ర వరకూ బాగున్నాయ్ అంతే. కానీ, సినిమాకి సంచలన స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టడంగానీ, వైరల్ కావడం కానీ జరగలేదు.
రీసెంట్గా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ సినిమాతో జాన్వీ ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోనూ అందుబాటులో వుంది. ఈ సినిమాలోనూ జాన్వీ తన పాత్రకు ప్రాధాన్యత వుండేలా చూసుకుందంతే. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేం. అలాగని ఫ్లాప్ అని కూడా అనలేం. అదీ జాన్వీ స్టామినా.!
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







