అంజీర్ పండ్లతో ఆరోగ్యం అందరికీ కాదు సుమా.!
- July 29, 2024
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ, అందరికీ సూట్ కావని నిపుణులు చెబుతున్నారు. నిజానికి అంజీర్ పండ్లు చాలా కాస్ట్‌తో కూడుకున్నవి. కానీ, తినడం వల్ల డ్రై ఫ్రూట్స్‌తో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయ్.
అయితే, అందరికీ అంజీర్ పండ్లు ఆరోగ్యం కాదని, కొందరికి చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా మైగ్రేన్ సమస్య వున్న వాళ్లు అంజీర్ పండ్లను తినడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువవుతుంది. అందుకు కారణం అంజీర్ ఎక్కువగా తినడం వల్ల సల్ఫేట్ పర్సంటేజ్ ఎక్కువవడం వల్ల మైగ్రేన్ సమస్య వున్న వాళ్లు అస్సలు తినకూడదని చెబుతున్నారు.
అలాగే, కిడ్నీ సమస్యలున్న వాళ్లు, కిడ్నీలో రాళ్లు, పిత్తాశయం, కాలేయ సమస్యలతో బాధపడేవారు అంజీర్ పండ్ల జోలికి అస్సలు పోరాదని చెబుతున్నారు.
అంజీర్ పండ్లలో చక్కెర స్థాయులు ఎక్కువ. అందుకే డయాబెటిస్ వున్నవాళ్లు కూడా అంజీర్ పండ్లను తినకుండా వుంటేనే మంచిది.
ఈ సమస్యలు లేని వాళ్లకు అంజీర్ పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా వుండడంతో పాటూ, విటమిన్ ఎ,బి,ఇ,కె అధికంగా వుంటాయ్. అలాగే, ఐరన్ మెగ్నీషియం, జింక్ వంటి మూలకాలు కూడా ఎక్కువే. అందుకే డ్రై చేసిన అంజీర్ పండ్లను తినడం మంచిది.
తాజా వార్తలు
- తిరుమల: శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ
- సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించిన టాస్క్ ఫోర్స్
- జూలై 21 నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు
- ఐసిసి ర్యాంకింగ్ లో 'కింగ్' విరాట్ కోహ్లినే!!
- సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి
- కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటి
- శ్రీవాణి టికెట్ల కేంద్రంలో సౌకర్యాలు కల్పించండి: టీటీడీ ఈవో శ్యామలరావు
- సలాలా అగ్రిటూరిజం ప్రాజెక్టులో గణనీయమైన పురోగతి..!!
- అబుదాబిలో 12 ప్రైవేట్ స్కూల్స్ పై నిషేధం..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్.. మిర్దిఫ్‌లో ట్రాఫిక్ డైవెర్షన్స్ అమలు..!!