‘బచ్చన్’ భామ సొంత గొంతుతో అప్పుడేనా.?
- July 31, 2024
ఒకప్పుడు హీరోయిన్లు డబ్బింగ్‌ని ఆశించేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తున్న ముద్దుగుమ్మలు తెలుగు భాషను కష్టపడి నేర్చేసుకుంటున్నారు. తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటామంటున్నారు.
నిన్న మొన్నటి వరకూ నార్త్ భామలైన రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్ధే తదితరులు అలాగే మలయాళ ముద్దుగుమ్మలు కీర్తి సురేష్, కన్నడ కస్తూరి రష్మిక ఇలా తదితర టాలెంటెడ్ భామలు సైతం వారి వారి పాత్రలకు వారే సొంత డబ్బింగ్ చెప్పుకోవడం విన్నాం.
ఇప్పుడు అదే లిస్టులోకి కొత్త బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే కూడా చేరిపోయింది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది ఈ అందాల భామ. తొలి సినిమాకే తన డబ్బింగ్ తానే చెప్పుకుందట.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా తొలి సినిమా రిలీజ్ కాకుండానే తెగ ట్రెండింగ్ అయిపోయింది భాగ్యశ్రీ బోర్సే. తనదైన అందచందాలు, ఆటిట్యూడ్‌తో తెలుగు ప్రేక్షకుల్ని బుట్టలో వేసేసుకుంది.
‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌తో కలిసి భాగ్యశ్రీ వేస్తున్న డాన్సులతో మరింత ట్రెండింగ్ అవుతోంది. ఈ డాన్సింగ్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!