కువైట్‌ మనీ ఎక్స్ఛేంజ్..తగ్గిన కంపెనీల నికర లాభాలు..!

- August 03, 2024 , by Maagulf
కువైట్‌ మనీ ఎక్స్ఛేంజ్..తగ్గిన కంపెనీల నికర లాభాలు..!

కువైట్: ఆదాయాలు తగ్గడం, ఖర్చుల పెరుగుదల కారణంగా కువైట్‌లోని మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీల నికర లాభం 2024 ప్రథమార్థంలో ఏటా 35.78 శాతం తగ్గింది.

కువైట్‌లో పనిచేస్తున్న ఎక్స్ఛేంజ్ కంపెనీలు ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 10.66 మిలియన్ దినార్ల నికర లాభాన్ని నమోదు చేశాయి.2023 మొదటి అర్ధ భాగంలో 16.60 మిలియన్ దినార్లు ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ జారీ చేసిన నెలవారీ గణాంకాల ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కంపెనీల ఆదాయాలు 11.63 శాతం క్షీణించి 39.14 మిలియన్ దినార్‌లకు పడిపోయాయి. 2023 సంబంధిత కాలంలో 44.29 మిలియన్ దినార్‌లుగా ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com