‘విరాజి’.! చేయాలి బాస్ ఎంకరేజీ.!
- August 03, 2024
కొంచెం బుర్ర పెడితే హారర్ కంటెంట్ కానీ, మిస్టరీ అండ్ క్రైమ్ కంటెంట్స్ కానీ భలే వర్కవుట్ అవుతున్నాయ్. తక్కువ బడ్జెట్.. ఇంటెన్స్‌తో తెరకెక్కిస్తే చాలు సక్సెస్ వచ్చి వాలినట్లే.
భాషతో సంబంధం లేకుండా కాస్టింగ్‌తో సంబంధం లేకుండా ఈ మధ్య ఈ తరహా కాన్సెప్టులు ధియేటర్లలో ఫెయిలైనా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నాయ్. తాజాగా ‘విరాజి’ అనే సినిమా వచ్చింది.
వరుణ్ సందేశ్ హీరో. ఒకప్పుడు లవర్ బోయ్ అయిన వరుణ్ సందేశ్ ఈ మధ్య ట్రాక్ మార్చేశాడు. డిఫరెంట్ కాన్సెప్టులు ట్రై చేస్తున్నాడు. అందులో భాగంగానే మొన్న ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు.
ఆ సినిమా హిట్టా.? ఫట్టా.? అనే సంగతి పక్కన పెడితే తాజాగా వచ్చిన ‘విరాజి’కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కోసం మనోడు డిఫరెంట్ లుక్ కూడా ట్రై చేశాడు.
ఇక, కథలోకి వెళితే, ఓ పాడుబడ్డ బంగ్లా, అక్కడక్కడా కొన్ని హారర్ టచ్‌లు, కట్ చేస్తే ప్రీ క్లైమాక్స్ నుంచి చెప్పలేనన్ని ట్విస్టులు.. ఇలా ‘విరాజి’ ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంటోంది.
రెగ్యులర్ పాయింటే తీసుకున్నా.. తెరకెక్కించిన విధానం కొత్తగా వుంది ‘విరాజి’ని. రెండు గంటల లోపే రన్ టైమ్ కావడం ఈ సినిమాకి మరో ప్రధానమైన ఆకర్షణ. ఒకే లొకేషన్.. తక్కువ బడ్జెట్లో మంచి అవుట్ పుట్ రాబట్టారు. ఇదే కదా కావల్సింది సినిమాకి. భారీ బడ్జెట్ పేరు చెప్పి తీరా రిలీజయ్యాకా ఆ సినిమా అంచనాల్ని అందుకోవడానికి చేసే పాట్లు ఈ మధ్య చూస్తున్నాం. సో, ‘విరాజి’ లాంటి సినిమాల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి తీరాల్సిందే.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..