అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా ప్రధాని మోడీ
- August 04, 2024
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా మరో సారి ప్రపంచయవనికపై నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మరోసారి తన పట్టు నిలుపుకున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ సంస్థ ర్యాంకులను విడుదల చేసింది. జులై 8 నుంచి 14వ తేదీ వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకులను ఇచ్చారు.
ఈ సర్వే ప్రకారం 69 శాతం ఓట్లతో భారత ప్రధాని నరేంద్రమోదీ మొదటి స్థానంలో నిలిచారు. 63 శాతం ఓట్లతో మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రేడర్ రెండో స్థానంలో ఉన్నారు. 25 మంది నాయకులతో కూడిన ఈ జాబితాలో జపాన్ ప్రధాని పుమియో కిషిడా చివరి స్థానంలో ఉన్నారు. ఆయనకు 16 శాతం ఓట్లు వచ్చాయి. గతంలో పలు గ్లోబల్ రేటింగ్స్‌లోనూ ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
టాప్ దేశాధినేతలు..
భారత ప్రధాని- నరేంద్ర మోదీ (69 శాతం)
మెక్సికో అధ్యక్షుడు- లోపెజ్ ఒబ్రేడర్ (63)
అర్జెంటీనా అధ్యక్షుడు- జేవియర్ మిలి (60)
స్విట్జర్లాండ్ అధ్యక్షుడు- వియోల్ అమ్హెర్డ్ (52)
ఐర్లాండ్ ప్రధాని- సైమన్ హారిస్ (47)
యూకే ప్రధాని- కీర్ స్టార్మర్ (45)
పోలాండ్ ప్రధాని- డొనాల్ట్ టస్క్ (45)
ఆస్ట్రేలియా ప్రధాని- ఆంథోని అల్బనీస్ (42)
స్పెయిన్ ప్రధాని- పెడ్రో శాంచెజ్ (40)
ఇటలీ ప్రధాని – జార్జియా మెలోని (40)
అమెరికా అధ్యక్షుడు- జోబైడెన్ (39)
కెనడా ప్రధాని- జస్టిన్ ట్రూడో (29)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!