మహానటితో ఎన్టీయార్.! ఈ జోడీ ఎప్పుడు సెట్టయ్యేనో.!
- August 06, 2024
మహానటి కీర్తి సురేష్‌కి జూనియర్ ఎన్టీయార్‌తో నటించాలని వుందట. మా జంట తెరపై చాలా బాగుంటుంది.. అని కీర్తి సురేష్ స్వయంగా క్రెడిట్ ఇచ్చేసుకుంది. ‘దసరా’లో వెన్నెల పాత్రకు గాను కీర్తి సురేష్‌కి ఉత్తమ నటి అవార్డు దక్కింది తాజాగా ఫిలిం ఫేర్ అవార్డుల్లో.
ఈ నేపథ్యంలోనే తన మనసులోని మాటను బయట పెట్టింది తాజాగా కీర్తి సురేష్. ఎన్ఠీఆర్ తో నటించాలన్న తన కోరిక ఎప్పుడు తీరుతుందో ఏమో కానీ, మా జంట స్క్రీన్‌పై చాలా బాగుంటుంది అని ఓపెన్‌గా చెప్పేసింది.
ఇంకేముంది.! అభిమానులు కూడా ఆ యాంగిల్‌లో ఆలోచించడం మొదలెట్టేశారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ‘రఘు తాత’ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే ఎన్టీయార్ ‘దేవర’లో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా వుంది. ఒకవేళ అన్నీ సెట్టయితే కీర్తి సురేష్ - ఎన్టీయార్ జోడీ ఈ సినిమాకి ఏమైనా సెట్టయ్యేనేమో లెట్స్ హోప్ ఇట్ అండ్ వెయిట్.!
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!