ఈ బిగ్‌బాస్ విన్నర్‌ని మళ్లీ టాలీవుడ్ పిలుస్తుందా.?
- August 06, 2024
‘దిక్కులు చూడకు రామయ్యా’ సినిమాలో ఇటు తండ్రినీ, అటు కొడుకునీ కూడా తన అందంతో మెస్మరైజ్ చేసి లవ్‌లో పడేసే హీరోయిన్ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా.! పేరు సనా మక్బూల్.
ఈ ముద్దుగుమ్మ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తోంది. అందుకు కారణం అమ్మడు హిందీ ఓటీటీ బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్‌గా వుండడమే. డే వన్ నుంచీ సనా మక్బూల్ తనదైన గేమ్ అండ్ ఆటిట్యూడ్‌తో ఎక్కువగా ఆదరణ పొందుతూ వచ్చింది.
ఫైనల్లీ టైటిల్ విన్నర్‌గా ట్రోఫీ గెలుచుకుంది. దాంతో, అమ్మడు మరింత ట్రెండింగ్ అయిపోయింది. ప్రెజెంట్ సనా మక్బూల్‌కి వున్న ట్రెండింగ్‌తో టాలీవుడ్ ఈ ముద్దుగుమ్మని మళ్లీ పిలుస్తుందేమో అంటున్నారు.
బిగ్‌బాస్ షోతో పాపులరైన చాలా మంది ముద్దుగుమ్మలు ఉదాహరణకి తెలుగమ్మాయ్ బిందు మాధవికి బోలెడంత పాపులారిటీ.. అలాగే ఆఫర్లు కూడా పెరిగిన సంగతి తెలిసిందే. అలాగే ‘దిక్కులు చూడకు’ భామ కూడా తెలుగులో మళ్లీ హవా కొనసాగిస్తుందేమో చూడాలిక.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







