కావ్య థాపర్‌ని బాగా వాడేశారుగా.!
- August 06, 2024
పూరీ జగన్నాధ్ సినిమాల్లో హీరోలే కాదండోయ్.. హీరోయిన్లు కూడా సమ్‌థింగ్ స్పెషల్. గ్లామర్ విషయంలో కాస్త కో ఆపరేట్ చేయాలే కానీ, హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించడంలో పూరీ జగన్నాధ్ స్థాయే వేరు.
అలాంటిది ‘ఏక్ మినీ కథ’ బ్యూటీ కావ్య థాపర్ గ్లామర్ విషయంలో అస్సలు మొహమాటాల్లేవీ బ్యూటీకి. ఇక, పూరీ జగన్నాధ్ సినిమా అంటే చెలరేగిపోయినట్లుంది. ‘డబుల్ ఇస్మార్ట్’లో విచ్చల విడిగా అందాలారబోసేసింది.
పవర్‌పుల్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే అందాల ఆరబోతలోనూ రెచ్చిపోయింది. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో అయితే, కావ్య థాపర్ హాట్‌నెస్ అల్టిమేట్. కొన్ని సందర్భాల్లో కాస్త ఎబ్బెట్టుగానూ అనిపించేసింది ఆమె అందాల దాడి.
ఏది ఏమైతేనేం, అందంతో పాటూ, అభినయం కూడా వున్న అమ్మడు ఇప్పటికైనా కెరీర్‌లో నిలదొక్కుకోగలిగితే, అంతే చాలు. అది జరగాలంటే, సినిమా హిట్టవ్వాలి. ట్రైలర్ విషయానికి వస్తే.. రెస్పాన్స్ అంతంత మాత్రమే అనిపిస్తోంది. చూడాలి మరి. ఏం జరుగుతుందో మరి కొన్ని రోజుల్లోనే తేలిపోనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







