ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌గా రాష్ట్రం: మంత్రి నారా లోకేష్‌

- August 07, 2024 , by Maagulf
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌గా రాష్ట్రం: మంత్రి నారా లోకేష్‌

అమరావతి: రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా గ్లోబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని విద్య, ఐటిశాఖ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్‌ విభాగం పనితీరు, ర్యాంకింగ్‌ మెరుగుదల, ఇంటిగ్రేటెడ్‌ యూనివర్సిటీ మేనేజ్‌మెంటు సిస్టమ్‌ ఏర్పాటు అంశాలపై బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎకోసిస్టమ్‌, ఇతర అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్‌, హెల్త్‌ కేర్‌, గవర్నెన్స్‌ తదితర రంగాల్లో సమర్ధవంతమైన సేవలు అందించే ఆస్కారం ఏర్పడుతుందన్నారు. అధునాతన ఎఐ టెక్నాలజీ ద్వారా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు స్టూడెంట్‌ పాస్‌పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్‌ క్యాలెండర్‌ పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కార్యదర్శి సౌరబ్‌గౌర్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామ్మోహన్‌రావు, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరు పోలా భాస్కర్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విసి అండ్‌ ఎమ్‌డి గణేష్‌కుమార్‌ పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com