శరవేగంగా భోగాపురం ఏయిర్పోర్ట్ పనులు
- August 11, 2024
అమరావతి: ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి భోగాపురం విమానాశ్రయానికి ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో చేపడుతున్న విమానాశ్రయ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని… ఇప్పటి వరకు 36.6 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు.
లనిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేస్తామన్నారు. జూన్ 2026 నాటికి ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రతినెల ఎయిర్పోర్ట్ పనులను పరిశీలించి వేగవంతం చేస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ఇక ఉడాన్ పథకంతో మన దేశ విమానయాన రంగం ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారిందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో కూడా విమానాశ్రయాలను త్వరలో నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణలోనూ కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
--సాగర్ కర్రి(మాగల్ఫ్ ప్రతినిధి,అమరావతి)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!