రేపు భారత దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్..!
- August 11, 2024
న్యూ ఢిల్లీ: వెస్ట్ బెంగాల్‌లో వైద్యురాలి దారుణ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో రెసిడెంట్ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యింది. బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో ఇప్పటికే వెల్లడైంది.ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అతడు పోలీసులకు అనుబంధ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే జూనియర్ డాక్టర్ దారుణ హత్యపై రెసిడెంట్ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు.
సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపించింది.ఆర్జీ కార్ మెడికల్ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపట్టినట్లు ప్రకటించింది. దౌర్జన్యాలకు గురైన తమ వారికి న్యాయం జరగాలని పేర్కొంది.ఈ విషయానికి రాజకీయ రంగు పులిమి ప్రతికూల కోణంలో చూడొద్దని అభ్యర్థించింది. అన్ని వర్గాలు వైద్యులకు మద్దతు ఇవ్వాలని కోరింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!