కీర దోసకాయతో ఇన్ని లాభాలా?
- August 12, 2024
కీర దోసకాయలో నీటి శాతం ఎక్కువ. మన శరీరం ఆరోగ్యంగా వుండాలంటే నీరు తాగడం చాలా అవసరం. అలాగే నీటి శాతం ఎక్కువగా వుండే పండ్లనూ కూరగాయలనూ కూడా ఎక్కువగా తీసుకుంటుండాలి.
అలాంటి వాటర్ కంటెంట్ వెజిటెబుల్స్లో కీర దోసకాయ ఒకటి. దీన్ని వండకుండానే తినేయొచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో కీర దోసకాయలు ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయ్.
ఎండ వేడినీ తాపాన్నీ తట్టుకునేందుకు కీర దోసకాయలు చేసే సాయం అంతా ఇంతా కాదు. అలాగే కిడ్న స్టోన్స్ వున్నవారికి దోసకాయ దివ్యౌషధం.
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల పనితీరును మెరుగు పరిచి ఆరోగ్యంగా వుంచేందుకు తోడ్పడతాయ్. అలాగే, రక్తపోటును కూడా అదుపులో వుంచేందుకు కీర దోసకాయ బాగా పని చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేందుకు తోడ్పడుతుంది. అందుకే షుగర్ పేషెంట్లకు కీర దోసకాయ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అలాగే, రక్త పోటు అదుపులో వుంచడంలో గుండె సమస్యల నుంచి దూరంగా వుండొచ్చు. క్యాన్సర్ కణాలు వృద్ధిని అడ్డుకోవడంలోనూ కీర దోసకాయ పాత్ర కీలకం. ఇందులోని గ్లైసిన్ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, లంగ్స్, లివర్ క్యాన్సర్ ముప్పు నుంచి మనల్నీ కాపాడుతుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!