మోకాలి నొప్పులతో బాధపడుతుంటే ఈ ఆహార పదార్ధాలకు కాస్త దూరంగా వుండాల్సిందే.!
- August 13, 2024
ఈ నయా నాగరికతలో మోకాలి నొప్పుల సమస్య వయసు తారతమ్యం లేకుండానే పెరిగిపోయింది. ఒకప్పుడు వయసు బాగా మళ్లిన వారికే మోకాలి నొప్పులు చూసేవాళ్లం.
కానీ, యుక్త వయసు పిల్లలకు సైతం మోకాలి నొప్పుల సమస్యలే. అలాగే శరీర బరువు కూడా మోకాలి నొప్పులకు ఓ కారణంగా చెప్పేవారు అప్పట్లో.
కానీ, సన్నగా వున్నవాళ్లూ లావుగా వున్నవాళ్లూ అనే తేడా లేకుండా మోకాలి నొప్పులు వేధిస్తున్నాయ్. మరి, ఈ సమస్యకు పరిష్కారం లేదా.? అంటే లేదనే చెప్పాలి.
కానీ, కొన్ని రకాల ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. అంతేకానీ, పూర్తిగా ఈ సమస్యల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు.
తాజాగా అందిన సర్వే ప్రకారం కొన్ని రెగ్యులర్ ఆహార పదార్ధాలు తీసుకోవడంలోనూ మోతాదు పాటించాలని తేలింది.
చక్కెర రోజూ ఉపయోగించేదే. కానీ, లిమిటెడ్‌గా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చక్కెరను ఎక్కువగా వినియోగించే వాళ్లు ఎవరైనా వుంటే తగ్గించుకోవాలని అంటున్నారు. చక్కెర వాడకం ఎక్కువ కావడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువవుతాయ్. తద్వారా శరీరంలో మంట మొదలవుతుంది. ఆ పై కీళ్లపై ఆ ప్రభావం చూపుతుంది.
అలాగే ఉప్పు వాడకం కూడా తగ్గించుకోవాలి. కీళ్లు, మోకాలి నొప్పులకు ఉప్పు కూడా ఓ కారణమే. వీలైతే ఉప్పు వాడకం కూడా మితంగానే వుండాలి. సాల్ట్ కన్నా రాక్ సాల్ట్ కొంత మేర నొప్పుల సమస్యల నుంచి కాపాడే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
పాలు, పాల ఉత్పత్తులు రెగ్యులర్‌గా డైలీ డైట్లో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయ్. అలా అని అన్‌లిమిటెడ్‌గా వీటిని వాడడం కూడా మంచిది కాదంటున్నారు.
తాజా వార్తలు
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!
- బర్కాలో స్పెషల్ ఆపరేషన్..భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!
- కువైట్ లో రికార్డు స్థాయిలో పెరిగిన వాహనాలు..!!
- ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర రక్తదాన కాల్స్..!!
- సౌదీ అరేబియాలో స్నాప్‌చాట్ కు యువత ఫిదా..!!
- స్నేహితులు మోసం..వేదన తట్టుకోలేక డాక్టర్ ఆత్మహత్య
- వరద బాధితులకు ఉచితoగా నిత్యావసర సరుకులు: సీఎం చంద్రబాబు
- తిరుమల పై ‘మొంథా' తుఫాన్ ప్రభావం







